Srisailam: డెడ్ స్టోరేజీకి చేరువలో శ్రీశైలం జలాశయం నీటిమట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలం జలాశయానికి సంబంధించి తాగునీటి అవసరాలను పక్కనపెట్టి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. తాగు, సాగు నీటి అవపరాలు తీరినప్పుడే జల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచనలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టేశాయి. ఫలితంగా శ్రీశైలం జలాశయం నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 215 టీఎంసీల సామర్థ్యానికి గాను 35 టీఎంసీల డెడ్‌స్టోరేజీ స్థాయికి నిల్వలు పడిపోయాయి.
Read Also: రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఇకపై జాతీయ ప్రాజెక్టులో 60 శాతం నిధులే
Also Read
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
శ్రీశైలంలో నీటిమట్టం పడిపోవడం… వచ్చేది వేసవికాలం కావడంతో ఇరు రాష్ట్రాల ప్రజలకు నీటి ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జలవిద్యుత్‌లో ఒక్క శ్రీశైలం వాటానే చెరో 40 శాతంగా ఉంది. నిజానికి తాగు, సాగునీటి అవసరాల కోసమే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఐదు నెలల క్రితమే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేఆర్ఎంబీ లేఖలు రాసింది. ఆ సమయానికి శ్రీశైలంలో 856.10 అడుగుల నీటి మట్టంతో 94.91 టీఎంసీల నిల్వలు ఉండేవి. అయితే ఇరు రాష్ట్రాలు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో మంగళవారం సాయంత్రానికి నీటి నిల్వ 35.51 టీఎంసీలకు పడిపోయింది.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!