Site icon NTV Telugu

EO Lavanna: మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన శ్రీశైలం ఈవో.. అందుకేనంటూ లవన్న వివరణ..

Eo Lavanna

Eo Lavanna

EO Lavanna: శ్రీశైలం ఆయల ఈవో లవన్న మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కడం వివాదాస్పదమౌతోంది. ఏపీ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరకున్న మంత్రి పెద్దిరెడ్డికి పూలమాలతో స్వాగతం పలికి ఆలయ ఈవో లవన్న. తర్వాత పాదాభివందనం చేశారు. శివమాలాధరణలో ఉండి మంత్రి పెద్దిరెడ్డికి పాదాభివందనం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు మంత్రి వద్దని వారిస్తున్నా దండ వేసి దండం పెట్టేవరకు వదిలిపెట్టలేదు. ఇలా శివమాల ధరించిన ఈవో శివభక్తుల మనోభావాలను దెబ్బతీసాడని.. వెంటనే ఆయనను సస్పెండ్‌ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also: Priyanka Pandit: ప్రియాంక పోర్న్ వీడియో లీక్.. ఆమె ఏమన్నదంటే ..?

అయితే, మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఘటనపై ఈవో లవన్న వివరణ ఇచ్చారు. పెద్దిరెడ్డి నా గురువు.. 76 సార్లు అయ్యప్పమాల వేసి శబరిమలకు వెళ్లివచ్చిన గురుస్వామికి మొక్కడం తప్పా? అని ఎదురుప్రశ్నించారు. హిందూ సంఘాలన్నీ నన్ను ఆక్షేపిస్తున్నాయనేది తప్పుడు ప్రచారమన్న ఆయన.. ఎదుటి వ్యక్తిలో శివున్ని చూడటం తప్పైతే గురువుని మొక్కడం కూడా తప్పే అవుతుందన్నారు. దర్శనాలు ఫ్రీగా జరగడం లేదని కేవలం నన్ను టార్గెట్ చేసి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా శ్రీశైలానికి మచ్చ తెచ్చే పనులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవలు అందించే విషయంలో ఒకటి, రెండు చోట్ల లోటుపాటులు సహజమే.. సరిదిద్దుకొని సేవలు అందించామన్నారు ఈవో లవన్న.

Exit mobile version