Union MInister Rammohan Naidu: ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ ఓ చరిత్రాత్మకమైన పెట్టుబడి.. కానీ, గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. డేటా సెంటర్‌కి అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్.. ఇలా చాలా ఇండస్ట్రీలు వస్తాయని తెలిపారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. స ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వస్థతలో ఏపీకి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సూర్యభగవానుని పరిసరాల్లో స్వచ్చత కార్యక్రమం చేశాం.. 25 లక్షల మోక్కలు నాటాం.. సైకిల్ ట్రాక్ లు నగరంలో ఏర్పాటు చేస్తాం.. సైకిల్ ఫర్ సండే సైకిల్ రూట్ లను ఏర్పాటు చేస్తాం అన్నారు.. గూగుల్ ఓ చరిత్రాత్మకమైన పెట్టుబడి.. నభూతో నా భవిష్యత్తుగా అభివర్ణించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
మంత్రి నారా లోకేష్ విశేషమైన కృషి చేశారు.. గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేక పోతున్నారు.. పైగా విమర్శిస్తున్నారు.. 5 ఏళ్లలో ఓక్క పెట్టుబడి తేలేదు గత వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.. ప్రతి పక్షంలో కూర్చుని బ్రాండ్ ఏపీ పేరుని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.. 1,88,000 వేల ఉద్యోగాలు డైరెక్ట్, ఇండైరెక్ట్ గా రానున్నాయి.. డేటా సెంటర్ కి అనుబధంగా పవర్, వాటర్, ఫుడ్ ఇండస్ట్రీలు వస్తాయి.. వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తుంటే అంత వారి అవివేకం అజ్ఞానం ప్రజలకు తెలుస్తాయి అన్నారు.. అన్ని జిల్లాలకు ఐటీ విస్తరించాలని శ్రీకాకుళం జిల్లాలో కూడా క్లస్టర్ లు గుర్తించాం.. ఫ్యూచర్ టెక్నాలజీ కంపెనీలను అన్ని జిల్లాలకు తీసుకోస్తాం.. నవంబర్ లో సీఐఐ సమ్మిట్ లో అనేక ఒప్పందాలు జరగనున్నాయి.. పలాస కార్గో ఎయిర్‌పోర్ట్ వల్ల ఎవరికి అన్యాయం జరగదు.. అందరికి న్యాయం చేసి ఎయిర్‌పోర్ట్ ముందుకు తీసుకెళ్తాం అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
