Duvvada Vani: శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలో గత పది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై నిరసన చేపట్టిన జడ్పీటీసీ దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ పిల్లల కోసమే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటామని తెలిపింది. శ్రీనివాస్ ఎలా తిరిగిన నాకు అనవసరం.. ఈ ఆందోళన వెనుక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు లేవు అని ఆమె చెప్పుకొచ్చింది. తప్పుడు ప్రచారం చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్.. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉండడానికి లిఖితపూర్వకంగా హామీ ఇస్తే చాలు అని దువ్వాడ వాణి తెలిపింది.
Read Also: Haryana Elections: హర్యానా ఎన్నికల ముందు బీజేపీ పాత మిత్రుడికి షాక్.. జేజేపీకి కీలక నేతలు గుడ్ బై..
అయితే, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం నివాసముంటున్న టెక్కలిలోని ఇంటి ముందు ఆయన కుమార్తెలు హైందవి, నవీన, భార్య వాణి ఆగష్టు 8వ తేదీన నిరసనకు దిగారు. ఇప్పటికీ ఆ నిరసన కొనసాగుతునే ఉంది. అయితే, ‘‘కొత్తగా నిర్మించిన ఆ ఇంటిలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అనే మరో మహిళతో కలిసి ఉంటున్నారని, మా ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్న తమ తండ్రి తమతో రావాలని ఆయన కుమార్తెలు వేడుకుంటున్నారు.
