Srikakulam: శ్రీకాకుళం జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ఉరిటి స్వప్నప్రియ అనే మహిళ మృతి చెందింది. ఎస్బిఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న స్వప్నప్రియ ఆత్మ హత్యకు యత్నించి చికిత్స పొందుతూ మరణించింది. వివరాలలోకి వెళ్తే.. స్వప్నప్రియ పని చేస్తున్న బ్యాంకులో బంగారం తనకా పెట్టారు ఖాతాదారులు. కాగా తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునేందుకు ఖాతాదారులు గత పది రోజులుగా బ్యాంకును సంప్రదిస్తున్నారు. అయితే డబ్బులు తీసుకుని తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వాల్సిన సిబ్బంది.. ఆలా చెయ్యకుండా ఆడిట్ పేరుతో వాయిదా వేస్తూ వస్తున్నారు బ్యాంక్ సిబ్బంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తాకట్టు పెట్టిన బంగారం మిస్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బంగారాన్ని స్వప్న ప్రియే మిస్ చేసిందంటూ ప్రధాన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read also:Indian Navy : సముద్రంలో పెరుగుతున్న భారత్ బలం.. నావికాదళానికి యాంటీ మిస్సైల్ వ్యవస్థ
అయితే ఈ ప్రచారం పైన స్పందించిన SBI R.M. రాజు.. ఖాతాదారుల ఆందోళనలతో బంగారం మిస్ అయ్యిందన్న ప్రచారంలో వాస్తవం లేదంటూ సోమవారం ప్రకటించారు. అలానే ఈ విషయం పైన అధికారులు మాట్లాడుతూ.. డిసెంబర్ 8నాటికి బ్యాంక్ ఆడిట్ పూర్తి చేసి ఖాతాదారుల బంగారాన్ని ఇచ్చేస్తామని వెల్లడించారు. కాగా స్వప్నప్రియ నిన్న రాత్రి పాయిజన్ తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను విశాఖ లోని కార్పొరేట్ హాస్పిటల్లో చెరిపించారు. ఈ క్రమంలో స్వప్నప్రియ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందింది. SBI అధికారులు ఖాతాదారులకు బంగారం ఆడిట్ అయిపోగానే ఇస్తామని ప్రకటించిన రెండు రోజులకే స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో బాధితల్లో ఆందోళన రేకెత్తుతుంది. అలానే స్వప్న ప్రియ మృతితో బంగారం మిస్ అయ్యిందన్న ఆరోపణలకు బలం చేకూరుతోందని బాధిత ఖాతాదారులు పేర్కొంటున్నారు.