Site icon NTV Telugu

టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై కేసు నమోదు

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను వీరు ఆవిష్కరించారు. దీంతో కరోనా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీరితో పాటు ఈ కార్యక్రమానికి ర్యాలీగా వచ్చిన పలువురు టీడీపీ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: క్రేజ్ అంటే ఇదేరా… మార్కెట్‌లో జగన్ ఆటం బాంబులు

టీడీపీ ర్యాలీ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కరోనా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమే కాకుండా మోటార్ వాహన చట్టాన్ని కూడా అతిక్రమించారని వీఆర్వో ఆరంగి మహేశ్వరరావు టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా నిబంధనల అమలు విషయంలో అధికార పార్టీ నేతలకు ఒకలా.. ప్రతిపక్ష పార్టీల నేతలకు మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు.

Exit mobile version