MLC Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గొడవలు రచ్చకెక్కాయి.. గత రెండు రోజులుగా ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇంటి దగ్గరే బైఠాయించారు వైసీపీ జెడ్పీటీసీ, శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, కూతురు హైందవి.. అయితే, రాత్రి ఉద్రక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఓ దశలో దాడికి కూడా ప్రయత్నం జరిగింది.. అయితే, నా ఇంటిలో ఒక విచిత్ర పరిస్థితి.. నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలి.. కానీ, వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ.. మైన్‌ను తన పేరు మీద మార్చాలని వాణి ఒత్తిడి చేసేది.. క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ చేసిది అన్నారు..
Read Also: Kolkata doctor murder: దారుణం..ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి ఆపై దారుణ హత్య
నేటికి రెండేళ్లుగా రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత మరో రకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడ.. సామాన్య స్థాయి నుంచి ఎదిగాను. 25 ఏళ్లలో ఒక్కరోజు వ్యక్తిగత పనులకు సమయం కేటాయించలేదు. అధికారం ఉన్నా లేకున్నా నేను ప్రజా సేవలో ఉన్నాను అన్నారు. నా రాజకీయ జీవితంలో కుటుంబాన్ని మిస్ అయ్యాను. కానీ, భర్త నిర్ణయాన్ని భార్యలు వింటారు.. నా ఇంటిలో ఒక విచిత్రం అన్నారు.. నేనేమీ స్థితి మంతుడుని కాను. అయినా.. 30 ఏళ్లలో నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడాను. విచ్చల విడిగా డబ్బు సంపాదించిన రోజులు, డీజిల్ కి డబ్బులు లేని రోజులు చూశాను అన్నారు. ఇద్దరు బిడ్డలకు డాక్టర్ చదివించాను. నా ఆశయం కోసం పనిచేస్తున్నాను.. నా చేతికి అవినీతి మరక అంటలేదు.. నేను ఎవరి దగ్గర రూపాయు ఆశించలేదు. ఇంత చేస్తే.. నాకు జరిగింది హైడ్రామా. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అహం , ఈర్ష్య, ద్వేశంతో నా భార్య నలిగిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇక, మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..