NTV Telugu Site icon

Duvvada Vani: ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా.. ఈ పరిస్థితి ఊహించలేదు..!

Duvvada Vani

Duvvada Vani

Duvvada Vani: ఆస్తులు లేని వ్యక్తిని ప్రేమించి, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను.. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అన్నారు టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ భార్య దువ్వాడ వాణి.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి వద్ద భార్య వాణి , కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది.. దువ్వాడ ఇంటివద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయగా.. ఆరుబయటే దువ్వాడ వాణి , హైందవి నిద్రించారు.. అయితే, శుక్రవారం అర్ధరాత్రి దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా సాగింది.. భార్య వాణి, కూతురు హైందవిపై దాడికి యత్నించారు దువ్వాడ. అయితే, ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన దువ్వాడ వాణి.. ఈ గొడవలతో పిల్లులు, ఫ్యామిలీ మొత్తం సపర్‌ అవుతున్నాం అన్నారు.. చిన్న పాపకు మ్యారేజ్ అవ్వాల్సి ఉంది. కొన్ని మనస్పర్దలు వచ్చే పరిస్థితి వచ్చింది. మా పరువు ప్రతిష్ట మంటగలుపుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Duvvada Srinivas: తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ.. అందుకే ఇదంతా..!

నా భర్త దువ్వాడ శ్రీనివాస్‌ వేరే మహిళ‌ చేతిలో ట్రాప్‌ కు గురయ్యారన్నారు దువ్వాడ వాణి.. మేం ఇంటికి వస్తే కొట్టడానికి ప్రయత్నించారు. నా మనసు చాలా గాయపడింది. నా లైఫ్‌ ఇలా టర్న్ అవుతుందని ఊహించలేదు అన్నారు. ఒక్కరూపాయి‌ నా కోసం బేర్ చేయలేని దువ్వాడను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను.. నా లైఫ్‌ పిల్లలకు రాకూడదని భర్తతో సర్దుకు పోయాను అన్నారు.. ఇక, దివ్వల మాధురిని ఎంకరేజ్ చేయడంలో దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను అవగాహనలేని మహిళను కాదు.. పార్టీ క్యాడర్ దివ్వల మాధురి ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. తన భర్తపై అధిష్టానానికి తెలిపాను. రోజు రోజుకూ కంపు‌చేసుకున్నది మాత్రం దువ్వాడ శ్రీనునే అన్నారు.. ఇక, నా పోరాటం కొనసాగుతుంది అంటున్న దువ్వాడ వాణి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments