NTV Telugu Site icon

Duvvada Srinivas Family Controversy: మమ్మల్ని చంపడానికి నాన్న ప్రయత్నం.. దువ్వాడ శ్రీనివాస్‌పై కూతురు ఆరోపణలు

Hindavi

Hindavi

Duvvada Srinivas Family Controversy: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి వద్ద భార్య వాణి , కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది.. దువ్వాడ ఇంటివద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయగా.. ఆరుబయటే దువ్వాడ వాణి , హైందవి నిద్రించారు.. అయితే, శుక్రవారం అర్ధరాత్రి దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా సాగింది.. భార్య వాణి, కూతురు హైందవిపై దాడికి యత్నించారు దువ్వాడ.. దీంతో.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన దువ్వాడ హైందవి.. మేం మాట్లాడడానికి వస్తే.. మా నాన్న కొట్టడానికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మమ్మల్ని చంపడానికి మా‌ నాన్న ప్రయత్నించారని సంచనల ఆరోపణలు చేశారు.. మాకు ఏం జరుగుతుందో తెలుసు… మేం డాక్టర్లం… మా ‌నాన్న మొబైల్ స్ర్కీన్ షాట్స్ మేం చూశాం.. మేం మెసేజ్ లు , ఫోన్ కాల్స్ చేశాం.. ఫోన్‌ లిప్ట్ చేయలేదు, రిప్లై ఇవ్వలేదు అనే ఆవేదన చెందుతున్నారు.. అయితే.. మా ఫ్యామిలీ ఫ్యామిలీ బ్రేక్‌ అవ్వడానికి ప్రధాన కారణం దివ్వల మాధురి అంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కూతురు హైందవి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments