Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు.. ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.. జిల్లాలోని ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది.. తెల్లవారుజామున 3:40 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకోగా.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రజలు.. భయాందోళనకు లోనయ్యారు.. మరోసారి ఉదయం 4:03 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి.. దీంతో.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు.. అయితే, శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకున్న తరుణంలో.. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు తెలియరాలేదు.. దీంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. మరోవైపు.. భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు అధికారులు. రెండేళ్ల క్రితం తరచూ భూప్రకంపనలు సంభవించాయి.. ఏ ప్రమాదం లేఖ పోవడంతో ఊపిరి పిల్చుకున్నారు ఉద్దానం ప్రజలు.
Read Also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..