NTV Telugu Site icon

Divvala Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం.. అసలు విషయం బయటపెట్టిన మాధురి..!

Divvala Madhuri

Divvala Madhuri

Divvala Madhuri: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది.. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురి అనే మహిళతో ఎఫైర్‌ ఉందంటూ శ్రీనివాస్‌ భార్య వాణి చేసిన ఆరోపణలపై అదే రేంజ్‌లో స్పందించారు దివ్వల మాధురి.. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. నన్ను అనవసరంగా బయటకు లాగొద్దు అని వార్నింగ్‌ ఇచ్చారు.. శ్రీనివాస్‌ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అది వారి కుటుంబ వ్యవహారం.. వారితోనే తేల్చుకోవాలి.. కానీ, తనను మధ్యలోకి లాగొద్దు అన్నారు.. ఇక, దువ్వాడ వాణి తన భర్తను వద్దనుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన మాధురి.. అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను కలిశారని చెప్పుకొచ్చారు..

Read Also: Mohammed Siraj: క్రికెట‌ర్ మ‌హ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్లో ఇంటి స్థలం కేటాయింపు..

అయితే, తాను దువ్వాడ శ్రీనివాస్‌కు ఎందుకు దగ్గరయ్యాననే విషయాన్ని కూడా బయటపెట్టారు దివ్వల మాధురి.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు.. ఆయన ఓ ఫ్రెండ్, ఫీలాసపర్ ఇంకా అన్నీ అని చెప్పుకొచ్చారు. ఆయన చాలా నిజాయితీ పరుడని ప్రశంసించారు.. మరోవైపు.. తాను దువ్వాడను ట్రాప్ చేయడానికి ఆయన వద్ద ఆస్తులేమీ లేవన్నారు. అతని ఆస్తులన్నీ కుటుంబానికి రాసిచ్చారని.. అలాంటప్పుడు ఇంకా నేను ఏం ఆశించి ట్రాప్ చేస్తామని ప్రశ్నించారు దివ్వల మాధురి..

Read Also: MP High Court: భార్య వంట చేయకపోవడం, భర్తను బట్టలు ఉతకమనడం.. ఆత్మహత్యకు కారణాలు కావు..

మరోవైపు.. సార్వత్రిక ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ప్రచారం కోసం తానే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టానని తెలిపారు. ఆ విషయం పార్టీ క్యాడర్ మొత్తానికి తెలుసన్నారు దివ్వల మాధురి.. ఈ సమయంలో ప్రతీ ఇంటికి వెళ్తూ.. శ్రీనివాస్‌-మాధురికి ఎఫైర్‌ ఉందంటూ.. వాణి చెప్పడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.. ఇక, మీకు ఓట్ బ్యాంక్ ఉంది పార్టిలోకి రావాలని వారే ఆహ్వానించారు. మా ఫ్యామిలి పెద్ద కుటుంబం. రాజకీయాలకు నేను చాలా దూరం. కానీ, జగనన్న అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ . దీంతో.. నన్ను బతిమాలి పార్టీలో జాయిన్ చేశారన్నారు.. అయితే, భార్య భర్తల మధ్య గొడవ ఉండకూడదని నేను దూరంగా ఉన్నాను.. కానీ, నా నన్ను, నా ఫ్యామిలీని వీధిలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు తనకు ఉందన్న ఆమె.. తమది మాత్రం ఇల్లీగల్ ఎఫైర్ కాదని స్పష్టం చేశారు. దువ్వాడ వాణి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆమె తన భర్తతో కూర్చుని పరిష్కరించుకోవాలని సూచించిన ఆమె.. మధ్యలో తనపై ఆరోపణలు చేయకూడదని వార్నింగ్‌ ఇచ్చారు.. తనపై లేనిపోని ఆరోపణలు చేశారు కాబట్టే.. నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటున్న దివ్వల మాధురి.. ఇంకా ఏం మాట్లాడిందో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..