దివ్వెల మాధురి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సోషల్ మీడియాలో తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం టెక్కలి సీఐ శ్రీనివాస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.
Read Also: Satya: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ లో పోటీకి దిగిన సాయి తేజ్ “సత్య”
అనంతరం దివ్వెల మాధురి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడవాళ్లపై సోషల్ మీడియా వేదిక అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూస్తామని వెల్లడించింది. ముఖ్యంగా జనసేన నేతలు తనపై చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకుంటారని తాను నమ్ముతున్నట్లు తెలిపింది. ఆ పోస్టుల్ని చూసి తాను మానసికంగా చాలా వేదన అనుభవించానని, అంత జుగుప్సాకరంగా జనసేన పేరు చెప్పుకుంటూ పోస్టులు చేస్తున్నారని ఆరోపించింది. అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూడా సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారని దివ్వెల మాధురి వాపోయింది. గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదని దివ్వెల మాదిరి విమర్శించింది.
Read Also: Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరు..? నేడు మహాయుతి కీలక సమావేశాలు..