NTV Telugu Site icon

CM Chandrababu: తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు

Cm Chandrababu

Cm Chandrababu

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంపినపుడు పీడ విరగడైందని ప్రజలు సంబరాలు, దీపావళి చేసుకున్నారు.. తాజా ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 93 శాతం స్ట్రైక్ రేట్.. 43 ఏళ్లైంది పార్టీ పెట్టి.. ఎప్పుడూ ఇన్ని సీట్లు గెలవలేదని అన్నారు. తనను అనేక మంది హింస పెట్టారు.. రాజీ లేని పోరాటం చేశామని చెప్పారు. దౌర్భాగ్యకరమైన రోజులు చూశాం.. స్వేచ్ఛే లేదని చంద్రబాబు అన్నారు.

Read Also: First Analog Space Mission: మొట్టమొదటి అనలాగ్ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో

తప్పు చేసిన వారిని వదిలిపెట్టను.. రాజకీయ కక్ష్యలు సాధింపులకు వెళ్లనని సీఎం చంద్రబాబు తెలిపారు. దీపం-1 తానే ఇచ్చానని.. ఇప్పుడు దీపం- 2 పథకం కూడా తానే ప్రారంభిస్తున్నానని అన్నారు. ఆడ బిడ్జలు ఖర్చు తగ్గించడానికి ఉచిత గ్యాస్ ఇవ్వాలనుకున్నా.. డ్వాక్రాలు పెట్టానని చెప్పారు. భర్త కంటే భార్యకు ఆదాయం ఎక్కువ వస్తుంది.. అది తెలుగు దేశం ఇచ్చిన శక్తి అని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు, ఆడపిల్లలకు అనేక పథకాలు అమలు చేస్తూ వచ్చాను.. ఆడపిల్లలకు సమాజంలో గౌరవం ఉండాలి.. అప్పుడే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. కేంద్రం కొన్ని అడ్డంకులు పెట్టారు.. సిలిండర్లు డబ్బులు కడితే ఇస్తామంటున్నారు.. డబ్బులు కట్టే పనిలేకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.. ఏర్పాటు చేస్తానని చెప్పారు. సిలిండర్ కోసం ఇప్పుడు డబ్బులు కడితే.. 48 గంటల్లో తాను డబ్బులు వేస్తానని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత సిలిండర్లుకు రూ.122 కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

Read Also: GST collection: అక్టోబర్‌లో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..!

Show comments