NTV Telugu Site icon

Case Filed on Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. దివ్వెల మాధురిపై కేసు నమోదు

Divvala Madhuri

Divvala Madhuri

Case Filed on Divvala Madhuri: రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కేసులో మరో ట్విస్ట్‌ వచ్చి చేరింది.. ఇప్పటికే రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్‌ ఈ కేసులో వెలుగు చూస్తుండగా.. ఇప్పుడు.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఆదివారం రోజు పలాస జాతీయ రహదారిపై దివ్వెల మాధురికి ప్రమాదం జరిగిన విషయం విదితమే.. ఈ యాక్సిడెంట్ లో మాధురి కారు నుజ్జునుజ్జైంది.. అయితే, తను కావాలనే ఆత్మహత్య యత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేశానని.. తనకు ఎలాంటి చికిత్స అవసరం లేదంటూ ఆస్పత్రిలో మాధురి హంగామా చేసింది.. కానీ, నెగ్లిజన్స్ తో పాటు ఇతురుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించారంటూ చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేశారు.. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం దివ్వెల మాధురిపై కేసు నమోదైంది..

Read Also: PM Modi : ట్రిపుల్ స్పీడ్‌తో పని చేయండి… రైతులు కొత్త రకాలను అనుసరించాలని మోడీ సూచన

మరోవైపు.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దివ్వెల మాధురికి విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తారు డాక్టర్లు.. తలకు తగిలిన గయానికి స్కానింగ్ తీశారు వైద్యులు.. చిన్న చిన్న బ్లడ్ క్లాట్ వున్నట్టుగా గుర్తించారు.. తీవ్రమైన తలనొప్పితో మాధురి ఇబ్బంది పడుతున్నారని వ్యక్తిగత సహాయకుల నుంచి అందుతోన్న సమాచారం.. కాగా, టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వివాదానికి దివ్వెల మాధురి సెంటర్‌ పాయింట్‌గా మారిపోయిన విషయం విదితమే.. దువ్వాడ ఇంటి దగ్గర నాలుగు రోజులుగా భార్యాకూతుళ్లు ఆందోళన చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ వర్సెస్ దువ్వాడ వాణి.. మరోవైపు మాధురిగా కత్తులు దూసుకుంటున్నారు.. ఈ సమయంలో మాధురి రోడ్డు ప్రమాదానికి గురికావడం సంచలనంగా మారింది.. ఆగి ఉన్న కారును ఆమె కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలవడంతో ముందుగా పలాస ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే..

Show comments