NTV Telugu Site icon

Bears on the beach: సముద్రతీరంలో ఎలుగుబంట్ల జలకాలాట.. పరుగులు పెట్టిన టూరిస్టులు

Bears

Bears

Bears on the beach: సముద్ర తీరానాకి వెళ్లిన మత్స్యకారులు, పర్యాటకులను అనుకోని అతిథులు కనిపించాయి.. వాటిని చూసి.. వాటి చేష్టలను చూసి షాక్‌తిన్న పర్యాటకులు.. ఎక్కడ తమపై దాడి చేస్తాయన్న భయంతో.. సముద్రతీరం నుంచి పరుగులు పెట్టారు.. ఇంతకీ.. సముద్రతీరానికి వచ్చిన ఆ అతిథులు ఎవరు? టూరిస్టులు, స్థానిక మత్స్యకారులు ఎందుకు హడలిపోయారనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: MLC Kavitha: కవితకు జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు హల్‌చల్‌ చేశాయి.. సముద్ర తీరంలో అవి సంచరించాయి.. తీరంలో ఉన్న బండ రాళ్ల మాటున జలకాలాట ఆడటం మొదలు పెట్టాయి.. అందులో ఓ పెద్ద ఎలుగుబంటి.. మరో చిన్న ఎలుగుబంటి జలకాలాడుతున్నాయి.. ఇది గమనించిన మత్స్యకారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఇటీవల కాలంలో ఎలుగుబంట్లు మనుషులపై దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఏ వైపు నుంచి వచ్చి భల్లూకాలు ఎటాక్ చేస్తాయోనన్న భయాందోళనలు‌ స్థానికుల్లో నెలకొన్నాయి. ఎలుగుబంట్లు సంచారంపై కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.