Site icon NTV Telugu

Srikakulam Stampede: కాశీబుగ్గలో తొక్కిసలాట.. స్పందించిన మంత్రులు..

Sklm Accident

Sklm Accident

Srikakulam Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాటలో 12 మంది మృతి చెందిన దుర్ఘటనపై ఏపీ మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించాం.. బాధిత కుటుంబాలను ఓదార్పుతున్నాం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అచ్చెన్నా అన్నారు.

Read Also: Kasibugga Stampede: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు..

అలాగే, శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనతో హుటాహుటిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యేను అడిగి సంఘటన వివరాలను తెలుసుకున్నాను.. తొక్కిసలాట ఘటన జరగటం నా మనసును కలచివేసింది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read Also: KTR: తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉంది..

ఇక, విద్యుత్ శాక మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.

Read Also: YS Jagan: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి..

కాగా, పలాసలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో హుటాహుటిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పర్యటనలో ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరి వస్తున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Exit mobile version