శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ అరుదైన ఘనత సాధించింది. 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేలో మూడు టైటిళ్లు గెలుచుకున్న ఏకైక మహిళగా శ్రీకాకుళం జిల్లా వాసి పైడి రజనీ రికార్డులకెక్కింది. గ్రాండ్ ఫినాలేలో జరిగిన క్లాసిక్ కేటగిరిలో మిసెస్ డైనమిక్ టైటిల్, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్, క్రౌన్ ఆంధ్రప్రదేశ్ టైటిళ్లను పైడి రజనీ గెలుచుకుంది. ఈ పోటీల్లో మొత్తం 100 మంది మహిళలు పాల్గొనగా… 38 మంది ఫైనల్స్‌కు అర్హత సాధించారు. తుది ఫలితాల్లో రజనీ విజేతగా నిలిచారు.
Read Also: శ్రీకాకుళం జిల్లాలో కాల్పుల కలకలం.. సర్పంచ్‌పై గన్‌షాట్
సింగపూర్, ముంబై, బెంగళూరు, చెన్నైకు చెందిన వారు న్యాయనిర్ణేతలుగా పాల్గొన్న మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పోటీల్లో జిల్లా వాసి విజేతగా నిలవడం గర్వకారణమని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్టలో జన్మించిన పైడి రజనీ ఎంఏ, ఎంఈడీ అభ్యసించారు. ఆమె భర్త పైడి గోపాలరావు పాలకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా సేవలు అందించారు. రజనీ తల్లి బొడ్డేపల్లి ఉమాదేవి దేవదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. రజని ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో ఇంగ్లీష్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. గతంలో శ్రీకాకుళంలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం విశాఖలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
