Site icon NTV Telugu

Minister Nara Lokesh: లోకేష్‌ను కలిసిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థులు

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేస్‌.. పుట్టపర్తిలో ప్రజలు, కార్యకర్తలను కలిశారు.. పలు సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు.. ఇక, ఈ సందర్భంగా.. మంత్రి లోకేష్ ను కలిశారు వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం-2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న మంత్రి నారా లోకేష్ ముందుగా.. ఈ రోజు ఉదయం కప్పలబండలోని పారిశ్రామిక వాడలో ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని భరోసా ఇచ్చారు.

Read Also: Brazil- Trump Tariff War: ట్రంప్ టారిఫ్‌లకి భయపడం.. అమెరికాపై భారీ సుంకాలు విధిస్తాం: బ్రెజిల్

ఇక, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్టర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు.. యూనివర్సిటీ గుర్తింపు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. విద్యార్థుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.. కలిసికట్టుగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనా చెందవద్దని భరోసా ఇచ్చారు. విద్యార్థులు విద్యపై దృష్టిపెట్టాలని, మీ భవిష్యత్ ను తాను చూసుకుంటాని ధైర్యం చెప్పారు మంత్రి నారా లోకేష్‌..

Exit mobile version