NTV Telugu Site icon

Extramarital Affair: భర్త రాసలీలలు.. అరగుండు గీసి ఊరేగించిన భార్య..

Affir

Affir

ప్రస్తుతం అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్య, భర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో మరో వ్యక్తితో రిలేషన్ షిప్ కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి విషయాలు తమ ఇళ్లలో తెలిసి.. కొంత మంది తమ భార్య, భర్తలను చంపేస్తుంటే.. మరి కొంత మంది వారిని వదిలి ఉండలేక తమ ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. కానీ, కొన్ని చోట్ల భార్యభర్తల అక్రమ సంబంధాలపై గుండు గీసి నగ్నంగా ఊరేగింపు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సేమ్ అలాంటి సీన్ ఇప్పుడు శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలో జరిగింది.

Read Also: Health Tips: మహిళలకు అరికాళ్లల్లో ఎందుకు నొప్పి వస్తుందో తెలుసా?

వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలో నేడు ( సోమవారం ) దారుణం చోటు చేసుకుంది. లేపాక్షి మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంపై భర్తను పలుమార్లు భార్య నిలదీసింది. అయినా కూడ అతనిలో మార్పు రాలేదు. ఇవాళ లేపాక్షి మండలంలోని తిలక్ నగర్ లో మరో మహిళతో హుస్సేన్ ఉండగా.. అతడ్ని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తకు, అతని ప్రియురాలికి భార్య అరగుండు కొట్టించి.. ఇద్దరికి చేతులు కట్టేసి.. గ్రామంలో ఊరేగించింది.

Read Also: TMC: ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదు.. ఉదయనిధి ‘సనాతన ధర్మ’ వ్యాఖ్యపై తృణమూల్

శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలోని లేపాక్షి మండలం ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ జంట తిలక్ నగర్ లో ఉన్న విషయాన్ని గుర్తించిన మహిళ తన పేరేంట్స్ కు విషయం చెప్పడంతో ఈ జంటను పట్టుకుని చితకబాదారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న జంటకు అరగుండు గీసి ఊరేగించారు.
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.