Site icon NTV Telugu

Dharmavaram: ధర్మవరంలో ఉగ్ర లింక్‌ల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో వంట మనిషి..!

Dharmavaram

Dharmavaram

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి.. స్థానికంగా ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు.. ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలను ఎన్ఐఏ గుర్తించింది. ఓ బిర్యానీ పాయింట్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ను అదుపులోకి తీసుకుని విచారింస్తోంది ఎన్ఐఏ బృందం. ధర్మవరం పట్టణంలోని లోనికోట ఏరియాలో నివాసం ఉంటున్న నూర్.. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దీంతో, ఎన్ఐఏ రంగంలోకి దిగింది… నూర్‌ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు.. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుంది. నూర్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.

Read Also: Ghattamaneni : తేజ డైరెక్షన్‌లో.. హీరోయిన్‌గా రమేష్ బాబు కూతురు ఎంట్రీ!

అయితే, ఆంధ్రప్రదేశ్‌తో ఉగ్ర లింక్‌లు వరుసగా బయటపడుతూ కలకలం రేపుతున్నాయి.. మొదట విజయనగరం.. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల లింక్‌లు ఆందోళనకు గురిచేశాయి.. రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.. 30 ఏళ్లుగా పట్టణంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూబకర్‌ సిద్ధిఖీ, మహ్మద్‌ అలీని అరెస్ట్‌ చేసిన ఐబీ అధికారులు.. వారి వద్ద స్వాధీనం చేసుకున్న సూట్‌ కేసు బాంబులు, బకెట్‌ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోపస్‌ పోలీసులు నిర్వీర్యం చేసిన విషయం విదితమే..

Exit mobile version