Site icon NTV Telugu

Occult worship: క్రికెట్‌ స్టేడియంలో క్షుద్ర పూజలు.. నిలిచిపోయిన టోర్నమెంట్..!

Occult Worship

Occult Worship

Occult worship: ఆధునిక సమాజంలోనే క్షుత్ర పూజలు భయపెడుతూనే ఉన్నాయి.. ఓవైపు అంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంటే.. మరోవైపు.. ఇలాంటి ఘటనలు.. నమ్మేవారిని మాత్రం భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా, శ్రీ సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.. గత నాలుగు రోజులుగా స్టేడియంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ జరుగుతుండగా.. నల్లచెరువులోని క్రికెట్‌ స్టేడియంలో క్షుద్ర పూజలు చేశారు.. క్రికెట్ స్టేడియంలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, కోడిగుడ్లు పెట్టి పూజలు చేసినట్టు అనవాళ్లు కనిపిస్తున్నాయి.. క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుండగా క్షుద్ర పూజలు జరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు.. క్రికెట్ స్టేడియంతో పాటు మండల కేంద్రంలోని మొబైల్ షాపు వద్ద కూడా క్షుద్ర పూజలు చేసినట్టుగా చెబుతున్నారు.. గత నాలుగు రోజులుగా స్టేడియంలో టోర్నమెంట్ మ్యాచ్‌లు జరుగుతుండగా.. ఆకతాయిలే ఈ మ్యాచ్‌లు ఆపడానికి క్షుద్రపూజలు చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అయితే, స్టేడియంలో క్షుద్రపూజలు చేయడంతో.. కొందరు క్రీడాకారులు మ్యాచ్‌లు ఆడేందుకు వెనకడుగు వేయడంతో.. మ్యాచ్‌లు కాసేపు నిలిచిపోయినట్టుగా సమాచారం.. అయితే, క్షుద్రపూజలు చేసినవారిపై చర్యలు చేపట్టాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు..

Read Also: Operation Sindoor: జర్రయితే పాకిస్తాన్ సచ్చిపోయేదే.. చివరి నిమిషంలో ఇండియన్ నేవీ దాడులు ఆపేసింది..

Exit mobile version