Site icon NTV Telugu

Paritala Sunitha: జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.. హెలికాప్టర్ దిగకుండానే..!

Paritala Sunitha

Paritala Sunitha

Paritala Sunitha: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. రాప్తాడు పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరోసారి తోపుదుర్తి సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె… జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రాప్తాడు వైసీపీ టికెట్ బీసీలకు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.. తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన తప్పుడు మాటలు నమ్మి రాప్తాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయొద్దు.. అని సూచించారు.. ఇద్దరి మధ్య జరిగిన గొడవను తోపుదుర్తి బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారు.. లింగమయ్య మరణంపై మొదటిగా బాధపడిన వ్యక్తిని నేనే.. దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు.. బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. జగన్ మోహన్ రెడ్డి.. లింగమయ్య కుటుంబానికి ఏదైనా సాయం అందించు.. అంతేగాని తోపుదుర్తి బ్రదర్స్ చెప్పిన మాట విని బీసీ కులాల్లో చిచ్చు పెట్టకు.. ఇప్పటికైనా చనిపోయిన లింగమయ్య కుటుంబానికి సాయం చేయడానికి నేను ముందుంటాను అని స్పష్టం చేశారు.

Read Also: UP: 7 రోజులు బంధించి, 23 మంది సామూహిక అత్యాచారం.. ఇంటర్ విద్యార్థినిపై దారుణం..

ఇక, జగన్ పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్‌ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి.. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందన్నారు.. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుతున్నారు.. కానీ, మాకు సీఎం చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదన్నారు. గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారు. వాహనాలు తనిఖీ చేసి.. మూడు వాహనాలకే అనుమతి ఇచ్చారు అని పాత ఘటనను గుర్తుచేశారు.. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నాడు.. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలి.. ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నాడు.. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. రాప్తాడు ఇంఛార్జ్‌ని బీసీకి ఇవ్వాలని సలహాఇచ్చారు. టీడీపీ నేతలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు.. ఎవరూ సహనం కోల్పోవద్దు అని సూచించారు రాస్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత..

Exit mobile version