MLA Nandamuri Balakrishna: తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. హిందూపురం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు.. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం.. అందులో పూజారిని మాత్రమే నేను అన్నారు.. గతంలో మా నాన్న ఎన్టీఆర్ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తాను.. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాను అన్నారు..
Read Also: Revanth Reddy: ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయి.. ప్రజలు పాలాభిషేకం చేస్తున్నారు!
ఇక, హిందూపురం త్వరలో అభివృద్ధి రంగంలో దూసుకెళ్తుందని తెలిపారు బాలయ్య.. ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయి. యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నో పరిశ్రమలు రానున్నాయన్నారు.. మొన్న ఢిల్లీ వెళ్లింది కూడా హిందూపురం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని.. కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది.. త్వరలో హిందూపురం రూపు రేఖలు మారనున్నాయన్నారు.. మరోవైపు, స్వాతంత్య్ర వేడుకల్లో నా ముందున్న చిన్నారుల కంటే నేనింకా చిన్నపిల్లవాడిని. వారి ఉత్సాహం చూస్తుంటే సంతోషం వేస్తుందన్నారు.. అటు సినిమా రంగంలోనైతే రాజకీయంగా మీ ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష. ఈ రోజు మీ అందరి గుండెల్లో ఉన్నానంటే నాకు జన్మనిచ్చిన మా నాన్న స్వర్గీయ ఎన్టీరామారావు దీవెనలే.. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
