Site icon NTV Telugu

MLA MS Raju: బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా..! ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్..

Mla Ms Raju

Mla Ms Raju

MLA MS Raju: తెలుగుదేశం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ జోలికి వస్తే.. చర్మం ఒలిచేస్తాం అంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. నేను బాలయ్య అభిమానిగా చెబుతున్నా అంటూ హెచ్చరించారు.. హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడరు… దీంతో, మా వాళ్లు ఆవేశంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.. అంతేకానీ, బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తాం.. మీకు, మీ అధినేత కూడా ఇదే మా హెచ్చరిక అంటూ హాట్‌ కామెంట్లు చేశారు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు..

Read Also: NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్ CV ఆనంద్ క్షమాపణలు

కాగా, సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే.. హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.. హిందూపురం వైసీపీ ఇంఛార్జ్‌ దీపిక రెడ్డి భర్త వేణు రెడ్డి ఆఫీసు మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు వాళ్లకు ఆగ్రహం తెప్పించాయి.. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యే ఎమ్మెస్‌ రాజు కూడా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు..

Read Also: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ! .

మరోవైపు, శ్రీ సత్యసాయి హిందూపురం నియోజకర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారు.. 2024 పార్టీ ఎన్నికల్లో పార్టీ విజయం.. ఒక కొత్త ఉత్సాహన్ని ఇచ్చింది.. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉంటుంది.. భవిష్యత్తులో మరో పార్టీ రాష్ట్రంలో టీడీపీతో తలపడలేదు అని వ్యాఖ్యానించారు.. ఇక, ఎన్టీఆర్ కొడుకుగా నాకు హిందూపురంలో మొదటిసారి అవకాశం ఇచ్చారు.. ఆ తర్వాత నేను చేసిన అభివృద్ధి కారణంగానే మూడు సార్లు గెలిచాను.. ఎన్టీఆర్ కొడుకు అంటే ఒక్కసారి మాత్రమే ఆదరిస్తారు.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేశాను కాబట్టే ఈ విజయం సాధ్యమైందన్నారు..సినిమాలంటే అరవడం, నవ్వడం, ఏడవడం కాదు.. సినిమాలో ఒక పాత్ర చేయడం అంటే ఒక ఆత్మలోకి ప్రవేశించడమే అన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..

Exit mobile version