Site icon NTV Telugu

CM Chandrababu: ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదు.. సత్యసాయి ట్రస్ట్‌పై సీఎం ప్రశంసలు..

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేష్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస.. ఇవే సత్యసాయి జీవన సూత్రాలని, ఇవి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే విలువలని సీఎం గుర్తుచేశారు. సత్యసాయి సేవలు అపారమైనవి అని పేర్కొన్నారు.

Read Also: India-Paksitan War: డ్రాగన్ గలీజ్ “దందా”.. భారత్-పాక్ ఘర్షణను ఆయుధాల ట్రయల్‌కి వాడుకున్న చైనా..

సత్యసాయి బాబా సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి తాగునీటి సౌకర్యం అందించిన తొలి సేవా కార్యక్రమం ఇదే అని తెలిపారు సీఎం చంద్రబాబు.. తాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని సత్యసాయి బాబా చెప్పారని.. అయితే, భక్తుల విరాళాలతో ఆ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, సత్యసాయి సేవాసంస్థలో పనిచేస్తున్న వాలంటీర్ల సంఖ్య 7.50 లక్షలు ఉండటం విశేషమని, ఎలాంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ వ్యవస్థకు కూడా ఇంతటి శక్తి లేదని సీఎం అభినందించారు. ఈ ఉత్సవాల సందర్భంగా సత్యసాయి ట్రైబల్ విమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ప్రారంభించడం ఆనందకరమని తెలిపారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version