నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సూళ్లూరు పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సంజీవయ్యను పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు.
Read Also: Anganwadi Chalo Vijayawada: ఛలో విజయవాడ నేపథ్యంలో అంగన్వాడీలు నిరాహారదీక్ష.. ముందస్తు అరెస్ట్లు
అవసరమైన చోట మాత్రమే ఇంఛార్జిలను ప్రకటించడం.. మిగిలిన చోట సిట్టింగులే పోటీ చేస్తారని విజయసాయి రెడ్డి తెలిపారు. మరోవైపు.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టి విమర్శిస్తున్న నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలకు షో కాజ్ నోటీస్ ఇచ్చామన్నారు. కొందరు మాత్రమే సమాధానం ఇచ్చారు.. వారు ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదన్నారు. మరోసారి పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని సూచించారు. అన్ని ఆలోచించే ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారని.. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించమని సాయిరెడ్డి తెలిపారు.
Read Also: Deputy CM Narayanaswamy: ఎవరు వచ్చినా జగన్ను ఏమీ చేయలేరు..
