Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు.. కాకాణిని వెంకటగిరి మేజిస్టేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.. ఈ నేపథ్యంలో వెంకటగిరిలో అప్రమత్తమైన పోలీసులు.. వెంకటగిరి కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు దిగడం లాంటి తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చేనెల తొమ్మిది వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.. దీంతో, వెంకటగిరి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకి కాకాణిని తరలించారు పోలీసులు.
Read Also: Minister Ponnam: రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తోంది..
