Site icon NTV Telugu

Nirmala Sitharaman: టీచర్‌గా మారిపోయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక్కసారిగా స్కూల్‌ టీచర్‌గా మారిపోయారు.. దేశ ఆర్థిక మంత్రి అయిన, ఈ సీనియర్‌ పొలిటిషన్‌ పిల్లల్లో ఒకరిలా కలిసిపోయి.. వారికి అచ్చమైన తెలుగులో పర్యావరణ పాఠాలు బోధించడం విశేషం.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్‌ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కొటిక్స్‌)ను సందర్శించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. నాసిన్‌ ఆవరణలో మియావాకీ విధానంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.. ఇక, స్థానిక రైతుల్ని, పాలసముద్రం ఉన్నత పాఠశాల విద్యార్థులను దానిలో భాగస్వాములను చేయగా.. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా ఉండాలంటే.. మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు నిర్మలా సీతారామన్‌.. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు క్లాస్ తీసుకున్న నిర్మలా సీతారామన్.. మొక్కల విశిష్టత – ఉపయోగాలు అంశంపై విద్యార్థులకు వివరించారు..

Read Also: Story board: తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితి ఏంటి? ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ? హామీల సంగతేంటి?

Exit mobile version