NTV Telugu Site icon

Somireddy Chandramohan Reddy: అవును జగన్‌ అన్నదే కరెక్ట్.. ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్..!

Somireddy Chandramohan Redd

Somireddy Chandramohan Redd

Somireddy Chandramohan Reddy: వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్‌ అన్నారు.. ఇది కరెక్ట్.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు… కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల్లో ఏలేరు పొంగి ప్రవహించింది.. భారీ వర్షం నమోదైంది.. కానీ, ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల ప్రాణ నష్టం తప్పిందన్నారు.. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నపుడు 17 వేల క్యూసెక్కుల నీరు వస్తే కాకినాడ వరకూ నీళ్లు వచ్చాయి.. ఇప్పుడు 42 వేల క్యూసెక్కుల నీరు వచ్చినా.. ముందు చూపుతో నీటిని వదిలి నష్టాన్ని నివారించారని స్పష్టం చేశారు..

Read Also: Devara : దేవర ప్రమోషన్స్ అంతా గప్ చుప్.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..

ఇక, జగన్ కు క్యూ కెక్కులు తెలీదు.. టీఎంసీలు అంటే తెలియదు అని ఎద్దేవా చేశారు.. ఇన్ ఫ్లో.. ఔట్ ఫ్లో అంటే కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు సోమిరెడ్డి.. ప్యాలస్‌లో కూర్చుని పాలించాడు.. జగన్ హయాంలో జలవనరులు.. వ్యవసాయ శాఖలు మూత పడ్డాయి.. జగన్ వల్ల పీఎల్‌ఆర్‌ కంపెనీ బాగు పడింది.. జగన్ హయంలో ఉన్న జలవనరుల శాఖ మంత్రి డాన్స్ లకు పరిమితమయ్యారు అని విమర్శించారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి టపాకాయలు కాల్చడం ఎంతవరకూ సబబు? అని ప్రశ్నించారు వరద బాధితుల పరామర్శకు వెళ్లిన జగన్.. ముద్దులు పెడుతున్నారు.. ఏలేరు ప్రాంతంలో ఒకే రోజు 17 సెంటీమీటర్ల వర్షం వచ్చింది.. అందువల్లే లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. ఏలేరు ఆధునికీకరణకు జగన్ హయాంలో నిధులు ఇవ్వలేదు.. వరద బాధితుల కోసం జగన్ కోటి రూపాయలు మాత్రమే విరాళం ఇచ్చారు.. దేశంలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో జగన్ మూడవ వారు.. అలాంటి వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. వరద బాధితులు జగన్ పరామర్శించలేదు.. కేవలం తన అనుచరులు ఉన్న ప్రాంతంలో మాత్రమే పర్యటించారు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..