Site icon NTV Telugu

Kakarla Suresh: కాకర్ల ట్రస్ట్ సేవలు గుర్తించి టీడీపీ అధిష్టానం టికెట్..

Kakarla

Kakarla

పురిటి గడ్డపై మమకారంతో మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో.. ప్రజల జీవితాలు మార్చాలన్న ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా 16 పథకాలను సొంత నిధులతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వేలాదిమందికి లబ్ధి చేకూర్చిన ఘనత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు దక్కింది. ట్రస్ట్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా వేలాదిమంది రోగులకు ఉచితంగా వారి ఇంటి వద్దకే వెళ్లి సేవలందించిన ఘనత కాకర్లదే. అదేవిధంగా వింజమూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేసి ప్రతిరోజు సుమారు 700 మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించి ప్రజల ఆకలి తీర్చి అన్నదాత అయ్యాడు.

మహిళలు మహారాణులను చేయాలన్న ఉద్దేశంతో టైలరింగ్ బ్యూటిషన్ కోర్సులు ఉచితంగా ఏర్పాటు చేసి వేలాదిమంది మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించి వారి ఇంట అన్నదమ్ముడు అయ్యాడు కాకర్ల. అదేవిధంగా నియోజకవర్గంలో ఇప్పటికే అనేక మంది గడపలు తొక్కి వారి కష్టాన్ని తన కష్టంగా భావించి వేలాది మంది అభాగ్యులకు తనకు తోసిన ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఇంట ఆపద్బాంధవుడు అయ్యాడు కాకర్ల సురేష్. చిరు వ్యాపారులకు తోపుడుబండ్లను అందజేసి వారి జీవన ప్రమాణాలను మార్చేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా యువతుల కోసం క్రీడా పోటీలను నిర్వహిస్తూ వారిలో నైపుణ్యాన్ని వెలిగితీస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపి తగిన బహుమతులను అందజేశారు. పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. పేద కుటుంబాలకు పెళ్లి కానుకలు అందజేస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 16 రకాల పథకాలను సొంత నిధులతో అమలుపరచుకుంటూ ప్రజల హృదయాలను గెలిచిన నేతగా ఎదిగారు కాకర్ల సురేష్. ఇప్పటివరకు తరాలు మారిన ఇంత సేవ చేసిన నాయకుడు లేడని నియోజకవర్గ ప్రజల మాట.

NHPC Jobs 2024 : NHPCలో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

విస్తృత సేవలను గుర్తించిన టీడీపీ అధిష్టానం
కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్న విస్తృత సేవలను గుర్తించిన అధిష్టానం కాకర్ల సేవలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో 2024 ఎన్నికల తొలి జాబితాలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయగిరి తెలుగుదేశం జనసేన అభ్యర్థిగా కాకర్ల సురేష్ ను ప్రకటించారు. ఆ రోజు నుండి కాకర్ల సురేష్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎన్నికల ప్రణాళికకు సిద్ధమవుతూ నాయకులను కార్యకర్తలను కలుచుకుంటూ తనదైన శైలిలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు కాకర్లకు మద్దతుగా తీర్మానాలు
నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలలో గ్రామస్థాయిలోని టీడీపీ నాయకులు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు టీడీపీ గెలుపుకు కృషి చేయాలని కాకర్లకు మద్దతుగా నిలవాలని తీర్మానాలు చేస్తున్నారు. అదేవిధంగా మండల స్థాయిలోని నాయకులు బూత్ కన్వీనర్లు టీడీపీ నామినేట్ పదవుల్లో ఉన్నవారు కాకర్లను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని తీర్మానాలు చేస్తున్నారు. అందులో భాగంగా జలదంకి మండలంలో బుధవారం మండల పార్టీ ఆధ్వర్యంలో కాకర్ల గెలుపే మన లక్ష్యం అని తీర్మానం చేశారు. కాకర్ల ట్రస్ట్ కార్యాలయం వద్దకు తెలుగుదేశం జనసేన నాయకులు తండోపతండాలుగా వచ్చి మీ వెంటే మేమంతా అంటూ తెలుగుదేశం జిందాబాద్.. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి.. కాకర్ల సురేష్ విజయం తద్యం అంటూ నినాదాలు చేశారు.

కాకర్ల పట్ల ఆకర్షితులైతున్న వైసీపీ నాయకులు
నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలలోని కొంతమంది నాయకులు కార్యకర్తలు కాకర్ల సురేష్ పై ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే క్రమంలో చంద్రబాబు సమక్షంలో ఉదయగిరి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు టీడీపీ పార్టీలో చేరారు. త్వరలో జరగబోవు శంఖారావంలో యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Exit mobile version