Somireddy Chandramohan Reddy: అర్హులైన వారికి 18 అంకణాల ఇంటి నివాస స్థలాలు ఇస్తామని తెలిపారు సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.50 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించాం. సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలు వైద్యం కోసం వెళ్లే PHC, CHC లకు మరిన్ని వసతులను కల్పిస్తున్నాం అన్నారు.. ఇక, వైఎస్‌ఆర్ వైసిపి పాలనలో వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలను మూల పడేసిందని విమర్శించారు. గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరించారు.. అర్హులైన వారికి 18 అంకణాల ఇంటి నివాస స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తారని నమ్మకాన్ని వెలిబుచ్చారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..
Read Also: Delhi Election: మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. విద్యార్థులే లక్ష్యంగా వరాలు