Site icon NTV Telugu

Minister Parthasarathy: క్యాడర్‌ జాగ్రత్త..! కొందరు కోవర్టులు టీడీపీలో చేరుతున్నారు..

Minister Parthasarathy

Minister Parthasarathy

Minister Parthasarathy: రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుంది.. కొందరు కోవర్టులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.. టీడీపీలోని చిన్న చిన్న విబేధాలకు కోవర్టులు ఆజ్యం పోస్తున్నారు.. టీడీపీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి కొలుసు పార్థసారథి.. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన.. నెల్లూరు నగరంలోని యాదవ్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.. ఇక, టీడీపీ మహానాడు 2025లో మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఆరు పాలసీలు గేమ్ చేంజర్‌గా నిలవబోతున్నాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కార్యకర్తలకు, అన్నీ వర్గాల ప్రజలకీ పార్టీని చేరువ చేసేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.. ఐదేళ్లు కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.. అయితే, రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తోంది.. కొందరు కోవర్టులు టీడీపీలో చేరుతున్నారు.. టీడీపీలో చిన్న చిన్న విబేధాలకు కోవర్టులు ఆజ్యం పోస్తున్నారు.. క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.. ఇక, గత ఐదేళ్లలో తాగిన మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు మంత్రి కొలుసు పార్థసారథి..

Read Also: Hyderabad: బాలానగర్‌లో విషాదం.. డెలివరి చేసిన స్టాఫ్ నర్స్.. తల్లి బిడ్డా మృతి..

Exit mobile version