Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పహల్గామ్ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భారత్ దేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను ప్రేమిస్తాం అంటారు.. వీళ్లంతా కాంగ్రెస్ నాయకలు.. కొందరు ఎమ్మెల్సీలు కూడా వున్నట్టు వున్నారు.. అంతలా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే భారత్‌ను వదిలి పాకిస్థాన్ వెళ్లిపోండి అని సూచించారు.. జనసేన ఏపీ, తెలంగాణలో ఉంది.. కానీ, జనసేన విధానం జాతీయ వాదం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు..
ఇక, మత ప్రాతిపదికన హత్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం అన్నారు జనసేనాని.. తప్పులు చేసినవారిని రక్షిస్తూ వైట్ వాష్ చేయవద్దన్న ఆయన.. పాకిస్థాన్ జనాభాకు సమానంగా భారత్‌లో ముస్లింలు ఉన్నారు.. కానీ, భారతదేశంలో మత వివక్షకు చోటులేదని స్పష్టం చేశారు.. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశం.. ఇక్కడే చంపేస్తే ఎక్కడికి పోవాలి..? అని ప్రశ్నించారు.. క్లిష్ట సమయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది.. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయాలకంటే దేశ భద్రత ముందని పిలుపునిచ్చారు.. ఓట్ల కోసమే కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం అవసరం అన్నారు పవన్.. దేశంలో ఎక్కడ ఏం జరిగినా, దేశం మొత్తం దాని ప్రభావం ఉంటుంది.. సరిహద్దు మేనేజ్మెంట్ చాలా క్లిష్టమైన పని.. సరిహద్దులు కాపాడుకోకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి అన్నారు పవన్ కల్యాణ్.. ఉగ్రవాదాలను పూర్తిగా నాశనం చేయాలన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: AP BJP: అమరావతి పర్యటనకు ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్..!
కాగా, బెంగళూరులో స్థిరపడిన నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధుసూదన్.. ఈనెల 22న పహల్గామ్‌లో తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా.. ఉగ్రవాదులు కాల్చి చంపారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్‌కు చెందిన మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, కూతురు మేధ, కుమారుడు దత్తు ఉన్నారు. మధుసూదన్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్న విషయం విదితమే.
