Cyclone Montha: నెల్లూరు జిల్లాను బలంగా కొట్టేందుకు తుఫాన్ దూసుకొస్తుంది. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అందుకు తగ్గట్లుగానే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా చర్యలు తీసుకుంటుంది నెల్లూరు జిల్లా యంత్రాంగం. 144 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. ప్రతి రెవిన్యూ డివిజన్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ముంత తుఫాను తీవ్ర రూపం దాలుస్తోంది. గంట గంటకు తుఫాను చెన్నై వైపు దూసుకు వస్తోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీర ప్రాంతం మండలాలలో దీని ప్రభావం అతి తీవ్రంగా ఉండబోతోంది. దీంతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆయా మండలాలపై దృష్టి పెట్టారు. జలదిగ్బంధంలో చిక్కుకునే గ్రామాలపై ఫోకస్ పెట్టారు. సుమారు 160 గ్రామాలను ఇప్పటికే గుర్తించిన కలెక్టర్ ఆయా ప్రాంతాలలోంచే నీటిని బయట ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: Dhanya Balakrishna : అలాంటి సీన్లు చేయకపోతే కెరీర్ ఉండదు.. హీరోయిన్ కామెంట్స్
ఇక, పడిన వర్షపు నీటిని వెంటనే బయట ప్రాంతాలకు పంపేందుకు డ్రైనేజీ కాలువలని పటిష్టం చేస్తున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరగకుండా సివిల్ సప్లై అధికారులు ఎంపీడీఓ ల ఆధ్వర్యంలో నిత్యవసరాలను సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణపట్నం పోర్ట్ లో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కోవూరు, కావలి, ఉదయగిరి ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురవగా.. మిగిలిన ప్రాంతాలలో అదే స్థాయిలో వర్షాలతో పాటు ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి. తుఫాను చెన్నై తీరానికి సమీపానికి వచ్చే క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే 144 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కాలేజీలకు జిల్లా కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు ముందే గ్రహించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. NDRF, SDRF బృందాలను జిల్లాకు రప్పించారు. ఎక్కడ అవసరమైతే ఆయా ప్రాంతాలకి ఈ టీమ్స్ వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..
రాయలసీమ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షపు నీరు మొత్తం సోమశిల రిజర్వాయర్కు చేరుతుంది. దీంతో సోమశిల రిజర్వాయర్ లో నీరు 69 టిఎంసిలకు చేరింది. దీంతో అధికారులు ఫోన్స్ల రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతాలకి 65 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటిని విడుదల చేసిన క్రమంలో పెన్నా పరివాహ ప్రాంతాలలో ఉన్న బలహీనమైన పొర్లు కట్టలను మరమ్మత్తులు చేసేందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 40 ప్రాంతాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నట్లు తెలిపారు. 12 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
