రేపు ( మంగళవారం ) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వాకాడు మండలం రాయదరువు దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంఖుస్థాపన చేయనున్నారు. 94 కోట్ల రూపాయలతో పులికాట్ సరస్సు సముద్ర ముఖ ద్వారం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ONGC పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని బాధితులకు సీఎం వైఎస్ జగన్ ఆర్ధిక సహాయం అందించనున్నారు.
Read Also: Akshara Haasan: కమల్ కూతురితో ప్రేమాయణం.. చివరికి ఆమెతో పెళ్లి
ఇక, 23, 458 మత్స్యకార కుటుంబాలకు 161.86 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం సీఎం జగన్ అందించనున్నారు. ఓఎన్‌జీసీ ద్వారా నాల్గో విడత ఆర్ధిక సహాయం వైసీపీ ప్రభుత్వం అందజేస్తుంది. తడ మండలం మాంబుట్ట గ్రామం దగ్గర వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జమ చేయనున్నారు. అయితే, రేపు ( మంగళవారం ) సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా.. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. పదిన్నరకు సూళ్లూరుపేట తడ మండలం మాంబుట్టా సెజ్ కు ఆయన చేరుకోనున్నారు. ఫిషరీస్, ఆర్ &బీ, ఇరిగేషన్ శాఖకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంఖుస్థాపన చేయనున్నారు. సభను ఉద్దేశించి సీఎం ప్రసంగం చేయనున్నారు. ఇక, సభ అనంతరం గంట పాటు స్థానిక నేతలతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.