ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూలో భారీగా సడలింపులు చేసింది. గతంలో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా ఇప్పుడు అవి 6 వేలకు వచ్చాయి. అయితే కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని అంటున్నారు. ఇక ఈరోజు ఏపీలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.ఈ ఒక్కరోజే 8 లక్షణ వ్యాక్సిన్ లు వేసేలా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఒక్కరోజు 6 లక్షల వ్యాక్సిన్లు వేసింది ఏపీ ప్రభుత్వం.