Site icon NTV Telugu

AP Assembly Session: కోటంరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

Tammineni Sitaram

Tammineni Sitaram

ఏపీ అసెంబ్లీలో కొందరు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు సభాపతి తమ్మినేని సీతారాం. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, , పయ్యావుల కేశవ్ (Payyavula kesav), నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అలాగే మిగిలిన సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

Read Also: Somu Veerraju: పవన్‌ కామెంట్లపై స్పందించిన సోమువీర్రాజు.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు

అంతకుముందు కేవలం ఇద్దరు టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును మాత్రమే స్పీకర్ సస్పెండ్ చేశారు. గవర్నర్ రిసీవింగ్ అంశంపై సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు అవకాశం కల్పించాలని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికారపార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల పదే పదే అడ్డుతగిలారు. దీంతో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకుండా మీరు ఎలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.

దీంతో అప్పటికప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ మరలా వీరిద్దరి సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరారు. అయితే టీడీపీ సభ్యులు ఇంకా తమ ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని… వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులను అందరిని సస్పెండ్ చేయాలని మరో మంత్రి దాడిశెట్టి రాజా స్పీకర్‌కు తెలిపారు. సభలో అధికార పార్టీ తీరుపై టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు.

Read Also: Somu Veerraju: పవన్‌ కామెంట్లపై స్పందించిన సోమువీర్రాజు.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు

Exit mobile version