విశాఖపట్నంలోని పెందుర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తిలోని చిన్న ముసలివాడ గణేష్ నగర్ ప్రాంతంలో ఆవేశంలో అత్తను అల్లుడుచంపేశాడు. మృతురాలి పేరు దొగ్గ లక్ష్మీ వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటుంది. హంతకుడు కే. సన్యాసి నాయుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మృతురాలికి సొంత అల్లుడే కాక వరుసకు తమ్ముడు కూడా అవుతాడు. మృతురాలు దోగ్గ లక్ష్మీకి ముగ్గురు కుమార్తెలు.. గత కొంత కాలం నుండి తన భార్య అత్త వారి ఇంటి దగ్గర ఉండి పోవడంతో తరచుగా అత్తతో అల్లుడు సన్యాసి నాయుడు ఘర్షణకు దిగాడు.
Read Also: Nadendla Manohar: రుషికొండలో రాజమహల్ నిర్మించుకుంటూ క్లాస్ వార్ అంటారా?
ఇక, ఈరోజు మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో అత్త ఇంటికి వచ్చి అత్త లక్ష్మితో అల్లుడు సన్యాసి నాయుడు గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో మృతురాలు దొగ్గ లక్ష్మి క్రింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయంతో మృతి చెందింది. దీంతో నిందితుడిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనలో దొగ్గ లక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సన్నాసి నాయుడికి కఠినంగ శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.