Site icon NTV Telugu

ఏపీని ప్రధాని మోడీ మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు : సోము వీర్రాజు

Somu Veerraju

Somu Veerraju

గత ఏడేళ్లుగా ప్రధాని మోడీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి హైవే లు, ఫ్లై ఓవర్లు, ఎయిమ్స్ వంటివి కేంద్రమే రాష్ట్రంలో నిర్మాణం చేస్తుందని.. రూ. 2 వేల కోట్లతో టెండర్లు పిలిచినా ఎవరూ రాని దౌర్భాగ్య స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రోడ్ల మరమత్తులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేశారని కానీ…. తాము 7 నెలల క్రితమే చేపట్టామన్నారు. టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం రూ. 5 వేల కోట్లు ఇచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వం లబ్ది దారులకు ఎందుకు ఇవ్వడం లేదు..? అని మండిపడ్డారు. బీజేపీ ప్రజల పార్టీ.. ప్రజల సమస్యలను పరిష్కరించే పార్టీ.. రెండేళ్లుగా అనేక ప్రజా ఉద్యమాలు చేస్తున్నామని తెలిపారు. బద్వేల్ లో మిత్ర పార్టీ పోటీ నుండి తప్పుకున్నా బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో బీజేపీకి తప్ప ఇంకెవరికి రాజకీయ సిద్ధాంతాలు లేవని… బద్వేల్ లో బీజేపీ విజయం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Exit mobile version