NTV Telugu Site icon

పవన్‌ను వాటి గురించి మాట్లాడాలన్న సోము వీర్రాజు

సీఎం జగన్‌పై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.18 వేలకు అమ్ముతున్నారని, మధ్య, పేద తరగతి కుటుంబాలపై తీవ్ర భారం మోపుతున్నారని ఆయన అన్నారు.

గత, ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి పవన్‌ ప్రస్తావించాలని ఆయన కోరారు. జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్‌ పథకాన్ని నిలిపివేయాలని, పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలు జగన్‌ నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.