Site icon NTV Telugu

హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం: సోము వీర్రాజు

హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం.. వాటిని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో తిరుమల స్వామి దేవాలయం వద్ద అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులకు ఇక్కడకొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు.

Read Also: నేరగాళ్లకు ఏపీ ఫ్రెండ్లీ స్టేట్‌గా మారింది: పీతల సుజాత

గొడ్డలి కొండ దగ్గర కొంతమంది అన్యమతస్తులు చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేపడుతున్న కట్టడాల నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్థానిక బీజేపీ నేతలు దశలవారీగా పోరాటం చేస్తారన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆందోళనలకు సిద్ధమవుతుందని సోము వీర్రాజు హెచ్చరించారు.

Exit mobile version