Site icon NTV Telugu

Somu Veerraju: అగ్నిపథ్‌పై ఆందోళన వద్దు.. విధ్వంసం వెనుక కుట్ర

Somu1

Somu1

కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళన వద్దన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. రైల్వే అస్తులు విధ్వంసం వెనుక కుట్ర వుందన్నారు. అగ్నిపథ్‌ పధకం యువతకు చాలా ఉపయోగకరమనే విషయాలు తెలియని యువత అవేశాలకు లోనవుతున్నారు. సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన వారు సంఘ విద్రోహులుగా అనుమానాలు కలుగుతున్నాయి.

భారత సైన్యంలో చేరాలని కలలు కంటున్న యవతకు అగ్నిపథ్‌ ఒక సువర్ణావకాశం లాంటిది. సంఘ విద్రోహ శక్తులతో ప్రధాని పై వ్యతిరేక ప్రచారం చేసేవారు కలసి నిర్వహిస్తున్న విధ్వంసంగా కనపడుతోంది. అగ్నిపథ్‌ లో బేసిక్ జీతం ఇతర సౌకర్యాలు చూస్తేనే ఎంత ఉపయోగం ఉంటుందో అర్ధం అవుతోంది. కొందరు విధ్వంసకర శక్తులతో చేతులు కలపి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. రైల్వే ఆస్తులను టార్గెట్ చేసుకుని ధ్వంసం చేసారంటే సంఘవిద్రోహ శక్తులు ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తుల కుట్రగానే కనపడుతోందన్నారు.

UNICEF: పిల్లలపై వలస సంక్షోభం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే

Exit mobile version