Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సాంప్రదాయ వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి లేదు? అని లేఖలో ప్రశ్నించిన ఆయన.. ఈ విషయం ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగానైనా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని అందించిన భారత ఖండం ఖ్యాతిని తెలుసుకోండి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని లేఖలో సూచించిన ఏపీ బీజేపీ చీఫ్.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని.. ఏపీ సర్కార్ అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.. తరతరాలుగా దేశీయ సాంప్రదాయ వైద్యం విశ్వవిఖ్యాతమైతే ముఖ్యమంత్రి ఎందుకు సుముఖంగా వ్యవహరించడం లేదు? అని నిలదీశారు.. ఆయుర్వేదం, సిద్దా, యునాని, హోమియో పతి, నాచురోపతి మొదలైన వైద్య విధానాలు ఎన్నో వ్యాధులను వాటి మూలాలను నివారించే దిశగా సమవర్ధవంతంగా పనిచేసే పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు.. రాష్ట్రప్రభుత్వానికి వాటిపై కనీస శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమంటూ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒక్క సారి కూడా ఈ శాఖలపై సమీక్ష నిర్వహించకపోవడం పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదనడానికి తార్కాణం అన్నారు సోము వీర్రాజు.. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి త్వరితగతిన ఆయా శాఖల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. వైరస్ ల వల్ల అనేక ఆరోగ్యపరమై న ఇబ్బందులు ఎదుర్కొంటున్న విపత్కర సమస్యల ఎదుర్కొంటున్న దశలో అత్యధిక జనసాంధ్రత కలిగిన ఈ రాష్ట్రంలో అన్ని రకాల వైద్యవిధానాలు అందుబాటులోకి తీసుకుని రావలసిన భాధ్యత ప్రభుత్వానికి ఉండాలి.. సాంప్రదాయ వైద్యవిధానాల పట్ల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడనాడాలని ముఖ్యమంత్రి కి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.