Site icon NTV Telugu

Somu Veerraju: అంబటి లెక్కలు తప్పుల తడక

Somu Veerraju

Somu Veerraju

పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి రాంబాబు సరైన సమాధానం చెప్పడం లేదని, చెప్పేదంతా తప్పుల తడకగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. డయా ఫ్రమ్ వాల్ ను చంద్రబాబు కడితే దానిని ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ పై ఎందుకు నిపుణులతో పరిశీలన చేయడం లేదన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకుంది. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తూ ప్రజలకు నీళ్లు లేకుండా చేశాయి. రెండు ప్రభుత్వాలు చేతులెత్తేసాయి. హైడెల్ పవర్ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు. కేంద్ర సంస్థల నుంచి ఎంత అప్పు తెచ్చారో తెలపాలి?

ట్వీట్ లు కాదు డైరెక్ట్ గా సమాధానం చెప్పాలి. అనవసర అపోహలు కల్పించవద్దని హితవు పలికారు. గతంలోరూ.55 వేల కోట్లలో భారీగా చంద్ర బాబు తినేసారని జగన్ తో పాటు పలువురు ఆరోపించారు. ఇప్పుడు ఎలా అడుగుతారు రాంబాబు గారు. సమాధానం చెప్పండి. గతంలో మీ పార్టీ ఏం మాట్లాడిందో తెలుసుకోండి. మీరు కడుతున్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిందే అన్నారు సోము వీర్రాజు.

Atchannaidu : బొత్సకు వైన్ షాపుల సంఖ్య తప్ప పాఠశాలల సంఖ్య తెలుసా

Exit mobile version