Site icon NTV Telugu

ఇక వైసీపీ ఆగడాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు : సోము వీర్రాజు

వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌ వేదికగా బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు నిప్పులు చేరిగారు. హిందువులన్నా, హిందూ ఆలయాలన్నా జగన్ ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నట్లుందని, హిందువుల సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నట్లుందని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి హిందువులు తలచుకుంటే తమ ఓటు ద్వారా మీ ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు.

మొన్న త్రిపురాంతకంలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని తొలగించారు, నేడు గిద్దలూరులో ఏకంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో దగ్గరుండి చేయించారని, ఇకపై మీ ప్రభుత్వాన్ని, మీ ఆగడాలను ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version