Site icon NTV Telugu

Somu Veerraju: ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం ఎన్నాళ్ళు?

పాలకులు ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉత్తరాంధ్ర ఉత్తమంగా ఉండాలి. వందేళ్ళ నుండి ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగానే ఉంది. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్దిపై చిన్న చూపు చూసాయి. భూములు ఉండి కూడా ఉత్తరాంధ్ర వాసులు దేశ వ్యాప్తంగా వలసలు పోతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నీటి ప్రాజెక్టులు విడిచి పెట్టి పోలవరం గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు.

పోలవరంపై ఉన్న శ్రద్ధ మిగిలిన ప్రాజెక్టుల పై ఉండటం లేదు. ఉత్తరాంధ్ర లో అనేక నీటి ప్రాజెక్టులు పై చిన్న చూపు చూస్తున్నారు. నీటి పాజెక్టులపై ప్రభుత్వంపై ఓత్తిడి తీసుకువచ్చేందుకు 7,8,9 తేదీల్లో ప్రాజెక్టుల సందర్శన చేస్తున్నామన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జోన్ ఖచ్చితంగా బీజేపీ కట్టి తీరుతుంది.

కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి సైతం రైల్వేజోన్ తీసుకురాలేకపోయారు. బీజేపీ ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేర్చింది. తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్స్ కు 60 శాతం కేంద్రం నిధులు ఇస్తుంది. బియ్యంకు 36 రూపాయలు ఇస్తుంది. వాహనాలు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఖర్చు ఉత్తరాంధ్ర పై పెట్టితే 5 లక్షల ఎకరాలు పంట పండుతుందన్నారు సోము వీర్రాజు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం చేస్తుంటే దానిని వీళ్ళ సంక్షేమంగా ప్రచారం చేస్తున్నారు.

పంచాయతీల నిధులు సైతం స్వాహా చేస్తున్నారు. బలమైన ఉద్యమాలు బీజేపీ చేపడుతుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ సమస్య లపై బీజేపీ ఉద్యమం చేస్తుందన్నారు సోము వీర్రాజు.

Exit mobile version