Site icon NTV Telugu

Somu Veerraju: అమరావతికిచ్చిన హామీలు అమలుచేయాలి

ఏపీలో అమరావతి విషయంలో ప్రభుత్వం తీరుని బీజేపీ తప్పుపడుతూనే వుంది. అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాజధాని పై హైకోర్టు తీర్పు అనంతరం సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.అఫిడవిట్ వివరాలు కోర్టు పరిధిలో ఉంటాయి.

అయితే ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ప్లాట్లుకు పనులు పూర్తి చేసి ఇవ్వాలి.తగిన సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.వందల రోజులు రాజధాని రైతులు ఉద్యమాలు చేస్తున్నారు.ప్రభుత్వం బెట్టు మాని ఒక మెట్టు దిగి వ్యవహరించాలి.రెండు ప్రభుత్వాలు రైతులు జీవితాలతో ఆటలాడుకున్నాయి.రాజధాని రైతులకు సమయపాలనతో కూడిన షెడ్యూల్ ఇచ్చి సమస్య పరిష్కారం చేయాలి.. ఈవిధంగా చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు సోము వీర్రాజు.

రాజధాని రైతుల సమస్య సజీవంగా ఉంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు కలిగించే రీతిలో వ్యవహరిస్తోంది. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు సమస్యలు ఒక టైం షెడ్యూల్ ప్రకారం పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చాఉ సోము వీర్రాజు.

Exit mobile version