Site icon NTV Telugu

2024లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తుంది : సోము వీర్రాజు

ప. గో జిల్లా : జనసేన పార్టీతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024 లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని… ఎలాంటి అనుమానాలు ఇందులో లేవన్నారు. జనసేన కి ఒక పాలసీ ఉంది.. తమకు ఒక పాలసీ ఉందని చెప్పారు. బిజెపి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదు….అందుకే బద్వేల్‌ లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. భిన్న అభిప్రాయాలు సాధారణం… జనసేన తో మిత్ర పక్షం గా కొనసాగుతామని ప్రకటించారు. చనిపోయిన అభ్యర్థి భార్య కి నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చు కదా… పోటిలో నిలపడం దేనికి…? అని వైసీపీపై ఫైర్‌ అయ్యారు. బద్వేల్‌ ప్రచారానికి పవన్ ని ఆహ్వానిస్తాం..వస్తారని ఆశిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన దగ్గర అవుతుందనే దానిపై తాను మాట్లాడను …దాని గురించి చర్చ అనవసరమని తెలిపారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు అన్నాడు అందుకే ఇవ్వలేదని తెలిపారు.

Exit mobile version