మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై వైసీపీ నేతలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. నెల్లూరును విడదీయవద్దని మేము ఎప్పుడో చెప్పామని, వైసీపీ నేతలు ఒక్కొరు ఒకో విధంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని కలిసే దమ్ము సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు.
కానీ సంబరాలు చేసుకుంటున్నారని, కొందరు నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి మరీ ఘోరంగా ఉందని, జిల్లాల విభజనపై సీఎంను కలవలేక మండలాల్లో కూర్చుని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లాల విభజన వల్ల నీటి పారుదల సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన అన్నారు.
