Site icon NTV Telugu

Somireddy Chandramohan Reddy: పోలవరం మీద తెలంగాణేకాదు ఢిల్లీ దిగివచ్చినా కుదరదు..!

Somireddy

Somireddy

గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో.. మరోసారి పోలవరం ప్రాజెక్టు, పోలవరం ముంపు ప్రాంతాల వివాదం తెరపైకి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, పోలవరం ఎత్తును తగ్గించాలనే డిమాండ్‌ తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తుండగా.. ఏపీ నుంచి దీనిపై కౌంటర్‌లు పేలుతున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పోలవరం మీద తెలంగాణతో పాటు ఢిల్లీ వాళ్లు దిగివచ్చినా.. ఎవరూ అభ్యంతరం పెట్టేందుకు కుదరని స్పష్టం చేశారు.. ముంపు గ్రామాలను వెనక్కు తీసుకోవడం అనేది ఉండదన్న ఆయన.. దీనిపై చట్టం ఎప్పుడో అయ్యిందన్నారు.

Read Also: Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్‌గేట్స్‌ని దాటేసిన అదానీ

రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ నష్ట పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సోమిరెడ్డి.. ఇప్పటికీ ఆంధ్ర.. తెలంగాణల మధ్య ఆర్థిక వివాదాలు పరిష్కారం కాలేదన్న ఆయన.. ఈ విషయంలో కేంద్రం, తెలంగాణ నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.. ఆంధ్రప్రదేశ్ కు వనరులు తగ్గిపోయాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను గత మూడేళ్లలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.. ఈ విషయాన్ని పార్లమెంట్ లో మంత్రి స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ విషయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు.. ఇక, రేపు మనుబోలులో భారీ ఎత్తున రైతు పోరు సభను నిర్వహించనున్నట్టు వెల్లడించారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

Exit mobile version